Congress Lead : పోస్ట‌ల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ హ‌వా

రేవంత్ ముందంజ కేసీఆర్ వెనుకంజ‌

Congress Lead : తెలంగాణ – రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జ‌లు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఎన్నిక‌ల ఫ‌లితాలు పూర్తిగా ఎగ్జిట్ పోల్స్ చెప్పిన‌ట్టుగానే వ‌స్తున్నాయి. గంప గుత్త‌గా ఉద్యోగులు బీఆర్ఎస్ పార్టీకి వ్య‌తిరేకంగా ఓటు వేసిన‌ట్లు స్ప‌ష్ట‌మైంది. కోడంగ‌ల్ లో టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డికు పోస్ట‌ల్ బ్యాలెట్ ప‌రంగా ముందంజ‌లో ఉన్నారు.

Congress Lead Viral

ఇక బీఆర్ఎస్ బాస్ , ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు వ్య‌తిరేకంగా కామారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో బ‌రిలో ఉన్నారు. తొలుత బీజేపీ అభ్య‌ర్థి వెంక‌ట ర‌మ‌ణా రెడ్డికి తొలుత ఆధిక్యంలో ఉన్న‌ప్ప‌టికీ త‌ర్వాత రేవంత్ రెడ్డికి ఇక్క‌డ ముందంజ‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

మొత్తంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మ‌డి జిల్లాల వారీగా చూస్తే పోస్ట‌ల్ బ్యాలెట్ల‌లో కాంగ్రెస్ పార్టీ(Congress) వైపు మొగ్గు చూప‌డం విస్తు పోయేలా చేసింది. కీల‌క‌మైన నేత‌లు ముందంజ‌లో ఉన్నారు. బీఎస్పీ చీఫ్ డాక్ట‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ , టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ మాజీ చీఫ్ బండి సంజ‌య్ కుమార్ , కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, సీత‌క్క , భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ , ఫిరోజ్ ఖాన్ , అక్బ‌రుద్దీన్ ఓవైసీ, హ‌రీశ్ రావు ప్ర‌స్తుతానికి లీడ్ లో కొన‌సాగుతున్నారు.

ఇదిలా ఉండ‌గా 119 నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల లోపు పూర్తి ఆధిక్యం ఏ పార్టీకి వ‌స్తుంద‌నే దానిపై క్లారిటీ వ‌చ్చే ఛాన్స్ ఉంది.

Also Read : DK Shiva Kumar : రిసార్ట్ పాలిటిక్స్ అవ‌స‌రం లేదు

Leave A Reply

Your Email Id will not be published!