Srikantha Chary : శ్రీకాంతా చారికి రేవంత్ రెడ్డి నివాళి
ఈ విజయం అమరుడికి అంకితం
Srikantha Chary : హైదరాబాద్ – తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడైన శ్రీకాంతా చారి వర్దంతి ఇవాళ. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమరుడైన శ్రీకాంతాచారికి నివాళులు అర్పించారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్ని కీలల్లో ఆహుతవుతూ తెలంగాణ ఆకాంక్షలను ఆకాశమంత ఎత్తుకు నిలిపిన అమరులైన వారందరికీ జోహార్లు అర్పిస్తున్నట్లు టీపీసీసీ చీఫ్ తెలిపారు.
Srikantha Chary Viral
నాలుగన్నర కోట్ల ప్రజల ఆకాంక్షలు ఫలించే సమయం ఆసన్నమైంది. ఇదిలా ఉండగా ఆదివారం రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో భారీ మెజారిటీ దిశగా కాంగ్రెస్ పార్టీ(Congress) ముందుకు సాగుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజారిటీ సీట్లను కైవసం చేసుకునే దిశగా ముందుకు వెళుతోంది.
ప్రధానంగా కీలకంగా ఉన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు సైతం వెనుకంజలో కొనసాగుతున్నారు. విపరీతమైన అహంకారంతో విర్ర వీగిన వారంతా ఇప్పుడు ఇళ్ల వద్దకే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది.
విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. ఇంకా తుది ఫలితాలు వెలువడే సరికి 70కి పైగానే సీట్లను కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది.
Also Read : Congress Lead : కాంగ్రెస్ ముందంజ బీఆర్ఎస్ వెనుకంజ