DGP Anjani Kumar : రేవంత్ రెడ్డికి డీజీపీ విషెస్
పలువురు ఐపీఎస్ లు
DGP Anjani Kumar : హైదరాబాద్ – రాష్ట్రంలో సీన్ మారి పోయింది. భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీకి లీడ్ వస్తోందని తెలియడం, తాను పోటీ చేసిన రెండు చోట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్దకు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు చేరుకున్నారు. దీంతో భద్రతను మరింత పెంచారు.
DGP Anjani Kumar Wishes to Revanth Reddy
ప్రస్తుతం సీఎం రేసులో ప్రధానంగా రేవంత్ రెడ్డి పేరు వినిపిస్తుండడంతో ప్రోటోకాల్ విషయంపై చర్చించేందుకు డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani Kumar) , సిటీ పోలీస్ కమిషనర్ తో పాటు పలువురు సీనియర్ పోలీస్ అధికారులు రేవంత్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు.
కేంద్ర, రాష్ట్ర బలగాలను భారీ ఎత్తున టీపీసీసీ చీఫ్ ఇంటి ముందు మోహరించారు. కాసేపట్లో గాంధీ భవన్ కు చేరుకోనున్నారు. దీంతో ప్రోటోకాల్ ప్రకారం రేవంత్ రెడ్డితో పాటు గెలుపొందిన ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ కల్పించాలనే దానిపై ఈ సందర్బంగా చర్చించారు.
ప్రస్తుతం 119 సీట్లకు గాను 66 సీట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుండగా బీఆర్ఎస్ పార్టీ 35 సీట్లకు పైగా లీడ్ కొనసాగుతోంది. ఇక పలు చోట్ల కీలకమైన మంత్రులు ఇంటి బాట పట్టనున్నారు.
Also Read : Rahul Priyanka Viral : అన్నా చెల్లెలు హల్ చల్