Telangana CID Chief : టీపీసీసీ చీఫ్ తో సీఐడీ చీఫ్ భేటీ
డీజీపీ, అడిషనల్ డీజీపీ కంగ్రాట్స్
Telangana CID Chief : హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికల ఫలితాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని స్పష్టమైంది. దీంతో రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ , అడిషనల్ డీజీపీ, లా అండ్ ఆర్డర్ చీఫ్ , సీఐడీ చీఫ్(Telangana CID Chief) మహేష్ భగవత్ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
Telangana CID Chief Meet Revanth Reddy
ఆదివారం రేవంత్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. వీరికి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఉన్నతాధికారులు రేవంత్ రెడ్డికి పుష్ప గుచ్ఛాలు అందజేశారు. టీపీసీసీ చీఫ్ ను ప్రత్యేకంగా అభినందించారు.
భారీ ఎత్తున తండోప తండాలుగా జనం తరలి వచ్చారు రేవంత్ రెడ్డి ఇంటి వద్దకు. దీంతో భద్రతను మరింత పెంచారు. ఇంటి వద్ద నుంచి గాంధీ భవన్ కు భారీ ఆదరణతో ముందుకు కదిలారు.
ప్రస్తుతం సీఎం రేసులో ప్రధానంగా రేవంత్ రెడ్డి పేరు వినిపిస్తుండడంతో ప్రోటోకాల్ విషయంపై చర్చించారు. కేంద్ర, రాష్ట్ర బలగాలను భారీ ఎత్తున టీపీసీసీ చీఫ్ ఇంటి ముందు మోహరించారు.
ప్రస్తుతం 119 సీట్లకు గాను 64 సీట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుండగా బీఆర్ఎస్ పార్టీ 40 సీట్లకు పైగా లీడ్ కొనసాగుతోంది. ఇక పలు చోట్ల కీలకమైన మంత్రులు ఇంటి బాట పట్టనున్నారు.
Also Read : DGP Anjani Kumar : రేవంత్ రెడ్డికి డీజీపీ విషెస్