Yashashwini Reddy : పాలకుర్తిలో యశస్వని పాగా
ఎర్రబెల్లికి కోలుకోలేని షాక్
Yashashwini Reddy : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యంలోకి వెళ్లింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో పాటు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, రాజ గోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మజా రెడ్డితో పాటు ఎక్కువగా ఫోకస్ పెట్టిన పాలకుర్తి శాసన సభా నియోజకవర్గంలో అద్భుత విజయాన్ని నమోదు చేసింది యంగ్ డైనమిక్ లీడర్ యశస్విని రెడ్డి.
Yashashwini Reddy Trend
ఓటమి ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు కోలుకోలేని షాక్ ఇచ్చారు జనం. ఆధిపత్య భావజాలానికి , అహంకారానికి ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో సక్సెస్ అయ్యారు యశస్విని రెడ్డి.
కంటిన్యూగా పాలకుర్తిలో గెలుస్తూ వచ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు కోలుకోలేని రీతిలో దెబ్బ కొట్టింది . ఎన్నారైగా తమ కుటుంబం చేసిన సేవలు తమను గెలిపిస్తాయని ముందు నుంచీ చెబుతూ వచ్చారు. తాము అమెరికాకు వెళ్ల బోమని పాలకుర్తిలోనే ఉంటామని , ప్రజలకు సేవలు అందజేస్తామని స్పష్టం చేశారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా యశస్విని రెడ్డి హాట్ టాపిక్ గా మారారు.
ఇప్పటి వరకు 119 సీట్లకు గాను తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన 60 సీట్లను కైవసం చేసుకునే దిశగా పయనం సాగుతోంది.
Also Read : Revanth Reddy Win : కోడంగల్ లో రేవంత్ విక్టరీ