Telangana MLAs List : 119 నియోజకవర్గాలు విజేతలు
కాంగ్రెస్ పార్టీకి అత్యధికం
Telangana MLAs List : హైదరాబాద్ – తెలంగాణలో(Telangana) తుది ఫలితాలు పూర్తయ్యాయి. మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యర్థులను గెలుపొందినట్లు ప్రకటించింది. ఇక ఆయా నియోజకవర్గాలలో ఎవరెవరు , ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందారని వివరాలు వెల్లడించింది. ఇక నియోజకవర్గాల పరంగా చూస్తే ఇలా ఉన్నాయి.
Telangana MLAs List Released
చెన్నూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్(Congress) పార్టీకి చెందిన గడ్డం వివేకానంద్ గెలుపొందారు. బెల్లం పల్లి నుంచి వినోద్ , సిర్పూర్ నుంచి హరీష్ బాబు, మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్ రావు, ఆసిఫా బాద్ నుంచి కోవా లక్ష్మీ గెలుపొందారు.
ఖానా పూర్ నుంచి వెడ్మ బొజ్జు , ఆదిలాబాద్ నుంచి పాయల్ శంకర్ , బోథ్ నుంచి అనిల్ జాదవ్ , నిర్మల్ నుంచి మహేశ్వర్ రెడ్డి, ముథోల్ నుంచి రామారావు పవార్ , ఆర్మూర్ నుంచి రాకేష్ రెడ్డి, బోధన్ నుంచి పి. సుదర్శన్ రెడ్డి, జుక్కల్ నుంచి తోట లక్ష్మి కాంత రావు విజయం సాధించారు.
బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ రావు, కామారెడ్డి నుంచి వెంకట రమణా రెడ్డి, నిజామాబాద్ అర్బజన్ నుంచి సూర్య నారాయణ, నిజామాబాద్ రూరల్ నుంచి భూపతి రెడ్డి, బాల్కొండ నుంచి ప్రశాంత్ రెడ్డి విక్టరీ నమోదు చేశారు.
కోరుట్ల నుంచి సంజయ్ , జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి, ధర్మపురి నుంచి లక్ష్మణ్ కుమార్ , రామగుండం నుంచి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ , మంథని నుంచి శ్రీధర్ బాబు, పెద్దపల్లి నుంచి వినయ రమణ రావు, కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్ , చొప్పదండి నుంచి మేడిపల్లి సత్యం, వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్ గెలుపు సాధించారు.
సిరిసిల్ల నుంచి కేటీఆర్(KTR) , మానకొండూరు నుంచి సత్యనారాయణ, హుజూరాబాద్ నుంచి కౌశిక్ రెడ్డి, హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ , సిద్దిపేట నుంచి హరీశ్ రావు, మెదక్ నుంచి రోహిత్ రావు, నారాయణఖేడ్ నుంచి సంజీవ రెడ్డి, ఆందోల్ నుంచి దామోదర రాజ నరసింహ, నర్సాపూర్ నుంచి సునీతా లక్ష్మా రెడ్డి విజయం సాధించారు.
జహీరాబాద్ నుంచి మాణిక్ రావు, సంగారెడ్డి నుంచి చింతా ప్రభాకర్ , పటాన్ చెరు నుంచి మహిపాల్ రెడ్డి, దుబ్బాక నుంచి ప్రభాకర్ రెడ్డి, గజ్వేల్ నుంచి కేసీఆర్(KCR), మేడ్చల్ నుంచి మల్లారెడ్డి, మల్కాజి గిరి నుంచి రాజశేఖర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నుంచి వివేకానంద్ , కూకట్ పల్లి నుంచి మాధవరావు, ఉప్పల్ నుంచి లక్ష్మా రెడ్డి, ఇబ్రహీంపట్నం నుంచి రంగారెడ్డి, ఎల్బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి గెలుపొందారు.
మహేశ్వరం నుంచి సబితా, రాజేంద్ర నగర్ నుంచి ప్రకాశ్ గౌడ్ , శేరిలింగంపల్లి నుంచి అరికె పూడి గాంధీ, చేవెళ్ల నుంచి కాలె యాదవయ్య, పరిగి నుంచి రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ నుంచి ప్రసాద్ కుమార్ , తాండూరు నుంచి మనోహర్ రెడ్డి, ముషీరాబాద్ నుంచి ముఠా గోపాల్ , మలక్ పేట నుంచి బలాలా, అంబర్ పేట నుంచి కాలేరు వెంకటేశ్ విక్టరీ నమోదు చేశారు
ఖైరతాబాద్ నుంచి నాగేందర్ , జూబ్లీ హిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్ , సనత్ నగర్ నుంచి తలసాని, నాంపల్లి నుంచి మాజీద్ హుస్సేన్ , కార్వాన్ నుంచి అమర్ సింగ్ , గోషా మహల్ నుంచి రాజా సింగ్ , చార్మినార్ నుంచి మీర్ అలీ , చాంద్రాయణగుట్ట నుంచి అక్బరుద్దీన్ , యాకుత్ పుర నుంచి జాఫర్ హుస్సేన్ , బహదూర్ పుర నుంచి ముబీన్ , సికింద్రాబాద్ నుంచి పద్మారావు గౌడ్ , కంటోన్మెంట్ లాస్య సందిత సాయన్న గెలుపొందారు.
కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి(Revanth Reddy), నారాయణ పేట నుంచి పర్ణికా రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల నుంచి అనిరుధ్ రెడ్డి, దేవరకద్ర నుంచి ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, మక్తల్ నుంచి వాకిటి శ్రీహరి, వనపర్తి నుంచి తూడి మేఘా రెడ్డి, గద్వాల నుంచి కృష్ణ మోహన్ రెడ్డి, ఆలంపూర్ నుంచి విజయుడు, నాగర్ కర్నూల్ నుంచి రాజేశ్ రెడ్డి విక్టరీ నమోదు చేశారు.
అచ్చంపేట నుంచి వంశీకృష్ణ, కల్వకుర్తి నారాయణ రెడ్డి, షాద్ నగర్ వీర్లపల్లి శంకర్ , కొల్లాపూర్ నుంచి జూపల్లి, దేవరకొండ నుంచి బాలు నాయక్ , నాగార్జున సాగర్ నుంచి జయవీర్ రెడ్డి, మిర్యాల గూడ నుంచి లక్ష్మా రెడ్డి, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోదాడ నుంచి పద్మావతి రెడ్డి గెలుపొందారు.
సూర్యాపేట నుంచి జగదీశ్ రెడ్డి, నల్గొండ నుంచి వెంకట్ రెడ్డి, మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి నుంచి అనిల్ కుమార్ రెడ్డి, నకిరేకల్ నుంచి వేముల వీరేశం, తుంగతుర్తి నుంచి మందుల శ్యామేలు, ఆలేరు నుంచి బీర్ల ఐలయ్య, జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్టేషన్ ఘన పూర్ నుంచి శ్రీహరి , పాలకుర్తి నుంచి మామిడాల యశస్విని రెడ్డి విజయం సాధించారు.
డోర్నకల్ నుంచి రామచందర్ నాయక్, మహబూబాబాద్ నుంచి మురళీ నాయక్ , నర్సంపేట నుంచి దొంతి మాధవరెడ్డి, పరకాల నుంచి ప్రకాశ్ రెడ్డి, వరంగల్ వెస్ట్ నుంచి రాజేందర్ రెడ్డి, ఈస్ట్ నుంచి కొండా సురేఖ, వర్దన్నపేట నుంచి నాగరాజు, భూపాలపల్లి నుంచి సత్యనారాయణ రావు, ములుగు నుంచి సీతక్క, పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు విజయం సాధించారు.
ఇల్లందు నుంచి కోరం కనకయ్య, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వర్ రావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మధిర నుంచి భట్టి విక్రమార్క, వైరా నుంచి రామ్ దాస్ నాయక్ , సత్తుపల్లి నుంచి రాగమయి, కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు, అశ్వారావు పేట నుంచి జారె ఆది నారాయణ, భద్రచాలం నుంచి వెంకట్రావు గెలుపొందారు.
Also Read : Revanth Reddy CM : ప్రమాణ స్వీకారం రేవంత్ సీఎం..?