BRS Ministers Loss : ఓటర్ల దెబ్బ మంత్రులు అబ్బా
కాంగ్రెస్ గాలిలో కొట్టుకు పోయారు
BRS Ministers : హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వెల్లడి అయ్యాయి. ప్రజాగ్రహానికి పలువురు మంత్రులు ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్(BRS) అధికారంలో కీలకమైన మంత్రి పదవులు చేపట్టారు. ఇక తమకు ఎదురే లేదంటూ విర్రవీగుతూ వచ్చిన సదరు మంత్రులకు కోలుకోలేని షాక్ ఇచ్చారు.
BRS Ministers Loss their Positions
వీరిలో ఎక్కువగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న వారిలో వనపర్తి జిల్లాకు చెందిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. విచిత్రం ఏమిటంటే సీఎంగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కూడా పెద్ద దెబ్బ తగిలింది. ఆయన రెండు చోట్ల పోటీ చేశారు. అయితే గజ్వేల్ లో ఈటల రాజేందర్ పై గెలుపొందగా కామారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి వెంకట రమణా రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తన పరువు తీసుకున్నారు.
నిన్నటి దాకా ఉద్యమ నాయకుడిగా గుర్తింపు పొందిన కేసీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. మరో వైపు ఇక మంత్రుల విషయానికి వస్తే వనపర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి మేఘా రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. యెన్నం శ్రీనివాస్ రెడ్డి చేతిలో మహబూబ్ నగర్ లో ఓటమి పాలయ్యారు ఎక్సై శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ , బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మరో మంత్రి కొప్పుల ఈశ్వర్ సైతం పరాజయం పాలయ్యారు.
ఇంకో వైపు ఓటమి అంటూ ఎరుగని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తిలో యశస్విని రెడ్డి చేతి లో దెబ్బ తిన్నారు.
Also Read : Vikas Raj : గవర్నర్ కు విజేతల జాబితా