Baba Balak Nath : ఎవరీ బాబా బాలక్ నాథ్
సింధియా గ్రూప్ వ్యతిరేకం
Baba Balak Nath : రాజస్థాన్ – ఎన్నికలు ముగిశాయి. భారీ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ హై కమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బాబా బాలక్ నాథ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన అభ్యర్థిత్వాన్ని బీజేపీకి చెందిన మాజీ సీఎం వసుంధర రాజే సింధియా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆమెకు మద్దతు ఇస్తున్న 25 మంది ఎమ్మెల్యేలు ఒప్పు కోవడం లేదు. వారి జాడ కనిపించక పోవడంతో ఉత్కంఠ నెలకొంది.
Baba Balak Nath ..?
ఇదిలా ఉండగా అనూహ్యంగా రాజస్థాన్ లో తెర మీదకు వచ్చిన బాబా బాలక్ నాథ్(Baba Balak Nath) ఎవరు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆయనను యోగి ఆఫ్ రాజస్థాన్ అని పిలుచుకుంటారు. తిజారా సీటు నుంచి గెలుపొందారు. అనూహ్యంగా రాజకీయ వేదిక పైకి వచ్చారు.
బాబా బాలక్ నాథ్ వయసు కేవలం 39 ఏళ్లు మాత్రమే. ఆయన ముందు నుంచి సీఎం పదవి ఆశిస్తూ వస్తున్నారు. ఆయన అల్వార్ లోక్ సభ నియోజకవర్గానికి ఎంపీగా కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రోహతక్ లోని బాబా మస్త్ నాథ్ మఠానికి అధిపతిగా ఉన్నారు బాబా బాలక్ నాథ్. 6 ఏళ్ల వయసులో ఇంటిని విడిచి పెట్టాడు. ఆ తర్వాత సన్యాసిగా మారాడు.
Also Read : Trains Flights Cancel : ఏపీలో రైళ్లు..విమానాలు రద్దు