AP Rain : భారీ వ‌ర్షం అంత‌టా అస్త‌వ్య‌స్తం

ఏపీలో కుండ పోత‌గా వ‌ర్షం

AP Rain : అమ‌రావ‌తి – బంగాళ ఖాతంలో చోటు చేసుకున్న అల్ప పీడ‌నం వాయు గుండంగా మారింది. ఏపీ(AP) ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎప్ప‌టికప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. మ‌రో వైపు తిరుప‌తి, తిరుమ‌లలో భారీ వ‌ర్షం కురుస్తోంది. ప‌లు జిల్లాల‌లో కుండ పోత‌గా వ‌ర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల ట్రాఫిక్ కు అంత‌రాయం ఏర్ప‌డింది.

AP Rain Updates

ఇక నెల్లూరు జిల్లాను వ‌ర్షాలు ముంచెత్తాయి. మిచౌంగ్ తుపాను దెబ్బ‌కు జ‌నం విల విల లాడుతున్నారు. జిల్లా తీర ప్రాంతాల్లో ఎడ తెరిపి లేకుండా కురుస్తుండ‌డంతో ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. చాలా కాల‌నీల్లోకి నీళ్లు వ‌చ్చిచేరాయి.

భారీ వ‌ర్షాల తాకిడికి చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలి పోయాయి. చాలా చోట్ల అంధ‌కారం చోటు చేసుకుంది. ప్ర‌జ‌లు క‌నీస అవ‌సరాల కోసం ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇక లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ చాలా చోట్ల జ‌ల‌మ‌యం అయ్యాయి. మ‌రికొన్ని చోట్ల జ‌నం జాగారం చేశారు. తిండికి నోచుకోలేక లబోదిబోమంటున్నారు.

దీంతో రంగంలోకి దిగాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. అగ్ని మాప‌క సిబ్బంది కూడా స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్నం అయ్యారు. ఇక కృష్ణ ప‌ట్నం నుంచి రామాయ‌ప‌ట్నం దాకా తుపాను దంచి కొడుతోంది. అల‌లు ఎగ‌సి ప‌డుతున్నాయి. 50 నుంచి 100 కిలోమీట‌ర్ల దాకా ముందుకు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

Also Read : Actor Vishal : చెన్నై మేయ‌ర్ పై విశాల్ ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!