DK Shiva Kumar : హై కమాండ్ సీఎంను ప్రకటిస్తుంది
స్పష్టం చేసిన కర్ణాటక డిప్యూటీ సీఎం
DK Shiva Kumar : న్యూఢిల్లీ – తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరపున సీఎల్పీ నేత , సీఎం అభ్యర్థి ఎవరనేది పూర్తిగా తన చేతుల్లో లేదని పేర్కొన్నారు రాష్ట్ర పరిశీలకుడు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ , మాజీ హోం శాఖ మంత్రి మాణిక్ రావు ఠాక్రేతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. వీరిద్దరూ ప్రస్తుతం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో భేటీ అయ్యారు.
DK Shiva Kumar Comment
వీరితో పాటు ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా హాజరయ్యారు. ఇవాళ పార్టీ పరంగా సీఎం ఎవరనేది హైకమాండ్ ప్రకటిస్తుందని స్పష్టం చేశారు డీకే శివకుమార్(DK Shiva Kumar). అంతే కాకుండా డిప్యూటీ సీఎంలు, కేబినెట్ లో ఎవరెవరికి మంత్రులుగా ఛాన్స్ ఇవ్వాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
మంగళవారం ఖర్గే నివాసానికి చేరుకునే ముందు డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో భారీ మెజారిటీ ఇచ్చినా ఇప్పటి వరకు సీఎం ఎవరనేది తేల్చక పోవడంతో ఉత్కంఠ నెలకొంది. దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు డిప్యూటీ సీఎం. ఈ మేరకు ఏకవాక్య తీర్మానం అధిష్టానానికి అందించడం జరిగిందన్నారు.
Also Read : AICC Focus : సీఎం ఎంపికపై ఏఐసీసీ కసరత్తు