Rahul Gandhi : న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ(Rahul Gandhi) న్యూఢిల్లీ లోని పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నివాసానికి చేరుకున్నారు. మంగళవారం: తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సీఎం అభ్యర్థిని ఖరారు చేసేందుకు గాను ఈ భేటీ కొనసాగుతోంది.
Rahul Gandhi and Kharge Meeting
రాహుల్ గాంధీతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా చేరుకున్నారు. అంతకు ముందు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా నిన్ననే రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఢిల్లీకి చేరుకున్నారు.
హైదరాబాద్ లో సీఎల్పీ మీటింగ్ జరిగింది. ఈ మేరకు ఏకవాక్య తీర్మానాన్ని పార్టీ చీఫ్ కు పంపించారు. ఇవాళ తన సోదరుడు, ఎంపీ డీకే సురేష్ నివాసంలో ఉన్నారు. డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. దాదాపు గంటకు పైగా సమావేశం అయ్యారు. ఎంపీగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని లోక్ సభ స్పీకర్ కు అందజేయడం జరిగిందన్నారు.
దీంతో సీఎం అభ్యర్తిత్వంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క కలవాలంటూ పార్టీ హై కమాండ్ ఆదేశించింది. దీంతో ఈ ఇద్దరూ హస్తినలో మకాం వేశారు.
Also Read : DK Shiva Kumar : హై కమాండ్ సీఎంను ప్రకటిస్తుంది