Dk Shiva Kumar : ముగిసిన సమావేశం సీఎంపై నిర్ణయం
వెళ్లి పోయిన రాహుల్..కేసీ వేణు గోపాల్
Dk Shiva Kumar : న్యూఢిల్లీ – తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సీఎం అభ్యర్థి ఖరారుకు సంబంధించి న్యూఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ ఖర్గే నివాసంలో కసరత్తు కొనసాగుతోంది. సీఎల్పీ సమావేశంలో అత్యధికంగా ఎమ్మెల్యేలు ఎవరిని ప్రతిపాదిస్తే, ఎవరిని కావాలని కోరుకుంటే వారినే ముఖ్యమంత్రి స్థానానికి ఖరారు చేసే ఛాన్స్ ఉందని సమాచారం. మొత్తంగా చూస్తే సీఎం రేసులో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క కూడా పోటీ పడుతున్నారు.
Dk Shiva Kumar Comment
కానీ పార్టీ హైకమాండ్ మాత్రం రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే తో పాటు పరిశీలకుడిగా ఉన్న కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ , డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(Dk Shiva Kumar) సైతం ఖర్గేతో భేటీ అయ్యారు.
అయితే ఎక్కువ మంది అభ్యర్థులు రేవంత్ వైపు చూడడం, ప్రతిపాదించడంతో ఆయనకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా సీఎం అభ్యర్థి ఎవరనేది హైదరాబాద్ లో డీకే శివకుమార్ వెల్లడిస్తారని ఏఐసీసీ స్పష్టం చేసింది.
అంతే కాకుండా ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎంలు, మంత్రులను కూడా ఖరారు చేసినట్లు సమాచారం.
Also Read : Rahul Gandhi : ఖర్గేతో రాహుల్ గాంధీ భేటీ