Revanth Reddy : ఇచ్చిన మాట నిలబెట్టుకోనున్న సీఎం
దివ్యాంగురాలికి జాబ్ ఇవ్వనున్న రేవంత్
Revanth Reddy : హైదరాబాద్ – సీఎంగా కొలువు తీరబోయే సమయంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని ప్రకటించారు. తాను టీపీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో దివ్యాంగురాలు రజని తనను కలుసుకుంది. కంట తడి పెట్టింది. తనకు బతకడం గగనంగా మారిందని, ఆదుకోవాలని విన్నవించింది. దీంతో చలించి పోయిన రేవంత్ రెడ్డి వెంటనే ప్రగాఢమైన నమ్మకాన్ని ఇచ్చారు.
Revanth Reddy Promises
తమ పార్టీ అధికారంలోకి రాబోతోందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ..ప్రమాణ స్వీకారం రోజే తొలి సంతకం నీకు జాబ్ ఇచ్చే ఫైల్ పై సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి(Revanth Reddy) నోటి వెంట వచ్చిన మాట నిజమైంది. అది వాస్తవ రూపం దాల్చింది.
ప్రస్తుతం 119 నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు వచ్చాయి. డిసెంబర్ 7న గురువారం లాల్ బహదూర్ స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరగనుంది. ఇందులో బాగంగా తను ఇచ్చిన మాట కోసం దివ్యాంగురాలు రజనికి జాబ్ ఇచ్చే ఫైల్ తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ శాంతి కుమారిని ఆదేశించారు.
ఈ మేరకు రజనీ కల నెర వేర బోతోంది కొత్త ముఖ్యమంత్రి ద్వారా. దీంతో బాధితురాలు కష్టం తీరబోతోంది. సుఖం దక్కనుంది.
Also Read : MLA Raja Singh : కేసీఆర్ ఖేల్ ఖతం – రాజాసింగ్