Lal Duhoma : మిజోరం – దేశంలో తాజాగా 5 రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ మూడు రాష్ట్రాలలో పవర్ లోకి వచ్చింది. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి కైవసం చేసుకోగా అదనంగా మరో రెండు రాష్ట్రాలలో జయకేతనం ఎగుర వేసింది. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ రెండింటిని కోల్పోయింది.
Lal Duhoma as a New CM of Mizoram
ఇదిలా ఉండగా ఈవీఎంలలో అక్రమాలు చోటు చేసుకున్నాయని అందుకే తాము ఓటమి పాలు కావడం జరిగిందని దిగ్విజయ్ సింగ్ , కమల్ నాథ్ ఆరోపించారు. ఇదిలా ఉండగా మిజోరం రాష్ట్రంలో మిజోరం పీపుల్స్ మూవ్ మెంట్ జెడ్ పీఎం నేత లాల్ దుహూమా(Lal Duhoma) ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చారు.
ఆయన ముఖ్యమంత్రిగా డిసెంబర్ 8న శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 40 స్థానాలు ఉండగా 27 స్థానాలు గెలుచుకుంది జెడ్పీఎం . అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న మిజో నేషనల్ ఫ్రంట్ ఈసారి పవర్ ను కోల్పోయింది. ఆ పార్టీ కేవలం 10 స్థానాలకే పరిమితమైంది. భారతీయ జనతా పార్టీ 2 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క స్థానంతో సరి పెట్టుకుంది.
Also Read : KTR : మీ రుణం తీర్చుకోలేను – కేటీఆర్