Congress Cabinet : కాంగ్రెస్ మంత్రివర్గం ఇదే
రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం
Congress Cabinet : హైదరాబాద్ – ఎట్టకేలకు కాంగ్రెస్(Congress) హైకమాండ్ ఉత్కంఠకు తెర దించింది. సీఎల్పీ నేతగా, సీఎంగా ఉమ్మడి పాలమూరు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎంపికయ్యారు. ఆయనను ఏకగ్రీవ తీర్మానం మేరకు రేవంత్ రెడ్డిని ఎంపిక చేసినట్లు ప్రకటించారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
Congress Cabinet Updates
ఇక డిప్యూటీ సీఎంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మల్లు భట్టి విక్రమార్కకు ఛాన్స్ దక్కింది. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు కేబినెట్ ను కూడా ఖరారు చేసింది. అందరూ అనుకున్నట్టుగానే అందరికీ ఆమోద యోగ్యమైన రీతిలో మంత్రివర్గాన్ని ఖరారు చేసింది హైకమాండ్ .
రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఫోన్లు చేశారు. ఆ మేరకు వారంతా వేదికపై కొలువు తీరారు. వీరితో పాటు ఎన్నికైన 64 మంది ఎమ్మెల్యేలు, సీపీఐ అభ్యర్థి కూనమనేని సాంబశివరావు కూడా ఉన్నారు.
సీఎంతో పాటు మరో 11 మందికి ఛాన్స్ దక్కింది.
ఇక కేబినెట్ లో కొలువు తీరబోతున్న వారిలో డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజ నరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, దాసరి సీతక్క , తుమ్మల నాగేశ్వర్ రావు, జూపల్లి కృష్టరావు ఉన్నారు.
Also Read : Lal Duhoma : మిజోరం సీఎంగా లాల్ దుహోమా