Revanth Reddy : రేపే ప్రజా దర్బార్ – సీఎం
ప్రకటించిన రేవంత్ రెడ్డి
Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. గురువారం లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం తాము సేవకులుగా ఉంటామని పేర్కొన్నారు.
Revanth Reddy Orders
ఇప్పటికే ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. దేశంలోనే కాదు ప్రపంచంతోనే పోటీ పడేలా తెలంగాణ రాష్ట్రాన్ని చేస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, ఉద్యమకారులకు పూర్తి భరోసా ఇస్తున్నానని చెప్పారు.
పది సంవత్సరాల కాలంలో ప్రగతి భవన్ లోకి ప్రజలను రానీయకుండా చేస్తూ వచ్చిన కంచెలను తొలగించడం జరిగిందని చెప్పారు రేవంత్ రెడ్డి. పార్టీకి చెందిన కార్యకర్తలను, నాయకులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని అన్నారు.
గతంలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ కు భిన్నంగా వ్యవహరించారు. తాను ప్రజల మనిషినని, ముఖ్యమంత్రినని చెప్పకనే చెప్పారు. డిసెంబర్ 8న శుక్రవారం ప్రజా దర్బార్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఎవరైనా సరే తన వద్దకు రావచ్చని , ప్రజలే ప్రభుత్వంలో భాగస్వాములని మరోసారి కుండ బద్దలు కొట్టారు రేవంత్ రెడ్డి.
Also Read : CM Revanth Reddy Signs : సీఎం సంతకం రజనీకి ఉద్యోగం