Pragathi Bhavan Fencing : ఇనుప కంచెలు తొలగింపు
ప్రగతి భవన్ వద్ద హై టెన్షన్
Pragathi Bhavan : హైదరాబాద్ – తెలంగాణ సీఎంగా కొలువు తీరిన ఎనుముల రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విధంగానే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ప్రగతి భవన్ కాదని ఇది ప్రజా భవన్ అన్నారు. తెలంగాణ కుటుంబం ఎప్పుడైనా ఎక్కడికైనా రావచ్చని స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారం సందర్బంగా జరిగిన సభ సాక్షిగా తెలిపారు.
Pragathi Bhavan Fencing Remove
సీఎం ఆదేశాల మేరకు పోలీసులు ప్రగతి భవన్(Pragathi Bhavan) వద్ద భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఇనుక కంచెలను తొలగించారు. దీంతో సామాన్యులు , నగర వాసులు పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ తన వద్దకు ఎవరూ రాకుండా ఉండేలా భారీ భద్రతను ఏర్పాటు చేయించారు.
ఇదే సమయంలో ఆందోళనలు, రాస్తారోకోలు, ధర్నాలు, నిరసనలు తెలియ చేయకుండా ఉండేందుకు
గాను ఇనుప కంచెలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనిపై పెద్ద ఎత్తున జనం మండిపడ్డారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డికి ఫిర్యాదులు అందాయి ఇనుక కంచెల ఏర్పాటుపై. ఇప్పటి వరకు ప్రధాన రంగమైన మీడియాను కూడా అనుమతించ లేదు.
కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో హుటా హుటిన కంచెలను తొలగించే ప్రయత్నం చేశారు.
Also Read : Revanth Reddy : రేపే ప్రజా దర్బార్ – సీఎం