CM Revanth Reddy Review : సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
సచివాలయానికి చేరుకున్న సీఎం
CM Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రిగా కొలువు తీరిన ఎనుముల రేవంత్ రెడ్డి నేరుగా తాజ్ హోటల్ కు చేరుకున్నారు. అక్కడ సోనియా, ఖర్గే, రాహుల్ , ప్రియాంకతో భేటీ అయ్యారు. మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చించారు. చివరకు ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు, డిప్యూటీ సీఎంకు శాఖలు కేటాయించారు.
CM Revanth Reddy Review Viral
అక్కడి నుంచి భారీ భద్రత మధ్య సచివాలయానికి చేరుకున్నారు. ఉద్యోగులు భారీ ఎత్తున సాదర స్వాగతం పలికారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పూల గుచ్ఛం ఇచ్చి ఆహ్వానం పలికారు.
వేద పండితులు ఆశీర్వచనం పలికారు. ఆయా ఆలయాల నుంచి తీసుకు వచ్చిన ప్రసాదాన్ని రేవంత్ రెడ్డికి(Revanth Reddy) అందజేశారు. అక్కడి నుంచి 6వ ఫ్లోర్ లో ఉన్న తన సీఎం ఛాంబర్ కు బయలు దేరారు. శాఖల కేటాయింపుతో మంత్రులు ఒక్కరొక్కరుగా సెక్రటేరియట్ కు చేరుకున్నారు.
సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ తో భేటీ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీల అమలుపై చర్చించారు. ఇదిలా ఉండగా ఇంటెలిజెన్స్ ఐజీగా శివ ధర్ రెడ్డని నియమించారు. సీఎంఓ కార్యదర్శిగా శేషాద్రిని నియమించారు సీఎం రేవంత్ రెడ్డి.
Also Read : Telangana Ministers : మంత్రులకు శాఖల కేటాయింపు