CM Revanth Reddy : ఇక రేవంత్ ప్రజా దర్బార్
శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి
CM Revanth Reddy : హైదరాబాద్ – దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్వహించిన ప్రజా దర్బార్ తర్వాత సుదీర్ఘ కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తిరిగి కల సాకారమైంది. సీఎంగా కొలువు తీరిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎనుముల రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంచలన ప్రకటన చేశారు. తాము పాలకులం కామని ప్రజా సేవకులమని స్పష్టం చేశారు.
CM Revanth Reddy in Praja Darbar
ఇందులో భాగంగా వచ్చీ రావడంతోనే ప్రజా దర్బార్ ఉంటుందని ప్రకటించారు. ఎవరైనా భయం లేకుండా రావచ్చని తెలిపారు. ఎప్పుడైనా తమ సమస్యను చెప్పుకునే ఛాన్స్ ఉంటుందన్నారు. కీలకమైన ఉన్నత అధికారులకు స్థాన చలనం కలుగుతోంది. ఇప్పటికే సీఎంఓ కార్యదర్శిగా నిజాయతీ ఆఫీసర్ గా పేరు పొందిన శేషాద్రిని ఎంపిక చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇదే సమయంలో ప్రభుత్వంలో కీలక శాఖ గా పేరు పొందిన ఇంటెలిజెన్స్ శాఖకు చీఫ్ గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ శివ ధర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించాలని సీఎస్ శాంతి కుమారిని ఆదేశించారు.
ప్రభుత్వ సలహాదారులుగా తెలంగాణ జన సమితి పార్టీ చీఫ్ కోదండరాం, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, ప్రముఖ ఉద్యమకారుడు గాదె ఇన్నా రెడ్డిని నియమించే ఛాన్స్ ఉంది.
Also Read : KCR EX CM : జారి పడిన మాజీ సీఎం కేసీఆర్