Sukesh Chandrasekhar : కవిత..కేటీఆర్ అరెస్ట్ ఖాయం
సుఖేష్ చంద్రశేఖర్ కామెంట్స్
Sukesh Chandrasekhar : న్యూఢిల్లీ – మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కుని జైలు పాలైన సుఖేష్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR), కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, కొడుకు మాజీ మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. ఇంతకాలం చేసిన అవినీతి, అక్రమాలకు బయటకు వస్తాయని పేర్కొన్నారు.
Sukesh Chandrasekhar Comments Viral
సుఖేష్ చంద్రశేఖర్ గతంలో తాను కవితతో చేసిన వాట్సాప్ ఛాటింగ్ కూడా బయట పెట్టారు. దానిని తీవ్రంగా ఖండించింది కవిత. తాజాగా మండోలి జైలు నుంచి లేఖ రాయడం కలకలం రేపింది. మీ అహంకారం అంతం అవుతుందని తాను ముందే చెప్పానని, ఇది ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖేల్ ఖతమైందని ఎద్దేవా చేశారు.
తాను చెప్పినట్టుగానే తెలంగాణ ప్రజలు తీర్పు చెప్పారంటూ పేర్కొన్నారు. మీరు చేసిన అవినీతిని రేవంత్ రెడ్డి కక్కిస్తారంటూ ఎద్దేవా చేశారు సుఖేష్ చంద్రశేఖర్. త్వరలో అరెస్ట్ భయంతో మీరు అమెరికాకు పరార్ అవుతారని అనుకుంటున్నానంటూ స్పష్టం చేశారు. త్వరలో కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని సంచలన కామెంట్స్ చేశారు.
Also Read : Revanth Reddy KCR : కేసీఆర్ ఆరోగ్యంపై రేవంత్ ఆరా