Prabhakar Rao : రేవంత్ సమీక్ష ప్రభాకర్ రావు డుమ్మా
విద్యుత్ శాఖ తొలిసారి సీఎం సమీక్ష
Prabhakar Rao : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొలువు తీరిన సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. తాను ప్రకటించినట్టు గానే శుక్రవారం ఉదయం 10 గంటలకే సచివాలయంకు చేరుకున్నారు. తొలిసారిగా చెప్పనిట్టు గానే ప్రజా దర్బార్ ప్రారంభించారు. వందలాది మంది ప్రజలు రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచి విచ్చేశారు. ఈ సందర్బంగా సీఎంతో వ్యక్తిగతంగా కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఎక్కువగా భూములు, ఇళ్ల పట్టాలు, వ్యక్తిగత సమస్యలు ఏకరువు పెట్టారు.
Prabhakar Rao Escaped from CM Program
ప్రజా దర్బార్ అనంతరం రాష్ట్రంలో కీలకమైన అంశంగా ఉన్న విద్యుత్ సమస్యపై ఆరా తీశారు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఈ మేరకు విద్యుత్ శాఖకు సంబంధించి సమీక్ష చేపట్టారు. సీఎంతో పాటు రాష్ట్ర హోం శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , నీటి పారుదల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. రాత్రి వరకు అయినా సరే పూర్తి వివరాలు తనకు అందజేయాలని ఆదేశించారవు రేవంత్ రెడ్డి.
మరో వైపు ఇప్పటి వరకు కేసీఆర్ ఇలాఖాలో అన్నీ తానై వ్యవహరిస్తూ వచ్చిన జెన్ కో, ట్రాన్స్ కో మాజీ సీఎండీ ప్రభాకర్ రావు ఇప్పటికే రాజీనామా చేశారు. అయితే ఆయన రిజైన్ లెటర్ ను ఆమోదించ వద్దని సీఎస్ ను ఆదేశించారు. దాదాపు రెండు సంస్థలకు సంబంధించి రూ. 85,000 కోట్లు అప్పులు ఎలా ఉంటాయని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఎలాగైనా సరే ఆయనకు నోటీసు ఇచ్చి రప్పించాలని సీరియస్ అయ్యారు.
Also Read : Akbaruddin Owaisi : ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్