CM Revanth Reddy : సీఎండీ తీరుపై సీఎం సీరియస్
నోటీసు ఇచ్చైనా హాజరు కావాల్సిందే
CM Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణ నూతన సీఎంగా కొలువు తీరిన ఎనుముల రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. శుక్రవారం సచివాలయంలో విద్యుత్ సంస్థలు ట్రాన్స్ కో, జెన్ కో లకు సంబంధించి సమీక్ష చేపట్టారు. ఈ కీలక సమావేశం వాడి వేడిగా కొనసాగింది. సీఎస్ శాంతి కుమారి తో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
CM Revanth Reddy Serious on CMD
విద్యుత్ సంస్థలకు సంబంధించి రూ. 85,000 వేల కోట్ల అప్పులు ఉండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత శాఖకు సంబంధించిన సీనియర్ విద్యుత్ శాఖ అధికారులను పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు సీఎం.
దీంతో హుటా హుటిన ఉన్న మేరకు వివరాలను అందించే ప్రయత్నం చేశారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందేనంటూ స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). అయితే ఇప్పటికే ట్రాన్స్ కో, జెన్ కో సంస్థలకు సీఎండీగా ఉన్న ప్రభాకర్ రావు ముందు జాగ్రత్తగా రాజీనామా చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు రేవంత్ రెడ్డి.
కీలక విద్యుత్ సమీక్ష సమావేశానికి డుమ్మా కొట్టడంపై సీరియస్ అయ్యారు. వెంటనే నోటీసు ఇచ్చైనా తన వద్దకు తీసుకు రావాలని సీఎస్ శాంతి కుమారిని ఆదేశించారు.
Also Read : Prabhakar Rao : రేవంత్ సమీక్ష ప్రభాకర్ రావు డుమ్మా