APPSC Group-1 : ఏపీలో గ్రూప్ -1 నోటిఫికేషన్ రిలీజ్
మొత్తం 81 పోస్టులకు భర్తీకి గ్రీన్ సిగ్నల్
APPSC Group-1 : అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు అర్హులైన నిరుద్యోగులకు ఖుష్ కబర్ చెప్పారు. ఈ మేరకు శుక్రవారం సీఎం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) వెంటనే గ్రూప్ -1 పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా 81 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది.
APPSC Group-1 Notification Released
జనవరి 1 నుంచి 21 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు స్పష్టం చేసింది ఏపీపీఎస్సీ. మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష చేపడతామని పేర్కొంది. గ్రూప్ -1లో 9 డిప్యూటీ కలెక్టర్ , 26 డీఎస్పీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది.
ఇదిలా ఉండగా నిన్ననే గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ కు సంబంధించి 18 పోస్టులు, రీజినల్ ఆర్టీఓ పోస్టులు 6, డిప్యూటీ రిజాస్ట్రార్ పోస్టులు 5 ను భర్తీ చేయనుంది. రాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా రాబోయే సంవత్సరంలో ఎన్నికలు రానున్నాయని, అందుకే యువతీ యువకుల ఓట్లు కొల్లగొట్టేందుకు గ్రూప్ -1 , గ్రూప్ -2 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లకు అనుమతి ఇచ్చారంటూ ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు.
Also Read : MLC Jeevan Reddy : అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్