CPI Ramakrishna : జగన్ రేవంత్ ను చూసి నేర్చుకో
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
CPI Ramakrishna : అమరావతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో నూతన ముఖ్యమంత్రిగా కొలువు తీరిన సీఎం రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. ప్రగతి భవన్ ముందు ప్రజలు రాకుండా ఏర్పాటు చేసిన బారికేడ్లను వెంటనే తొలగించారని, ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారని ప్రశంసలు కురిపించారు రామకృష్ణ.
CPI Ramakrishna Comments on AP CM YS Jagan
ఇక జగన్ మోహన్ రెడ్డి కొలువు తీరగానే రూ. 9 కోట్ల ప్రజా ధనంతో నిర్మించిన ప్రజా వేదికను కూల్చి వేశారంటూ మండిపడ్డారు. జగన్ నియంతలా వ్యవహరిస్తూ రాష్ట్రంలో విధ్వంసక పాలన చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
జగన్ పర్యటలన్నీ పోలీసుల మోహరింపుల మధ్య, పరదాలు , ముళ్ల కంచెల మాటున సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రామకృష్ణ(CPI Ramakrishna). గత నాలుగున్నర సంవత్సరాలలో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, ప్రజలను కలిసేందుకు జగన్ అనుమతించ లేదన్నారు.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇప్పటికీ కూడా గత దివంగత సీఎం జయలలిత పేరుతోనే పలు కార్యక్రమాలను కొనసాగిస్తూ వస్తున్నారని ఆయనను చూసైనా నేర్చుకోవాలన్నారు.
Also Read : CM Revanth Reddy : సోనియమ్మా చల్లంగ ఉండమ్మా