Harish Rao : రైతు బంధు ఇంకెప్పుడు
ప్రశ్నించిన హరీశ్ రావు
Harish Rao : హైదరాబాద్ – మాజీ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వంపై సెటైర్స్ వేశారు. మీడియాతో మాట్లాడిన హరీశ్ రైతు బంధు విషయంలో ఎందుకని ఇంకా డబ్బులు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. రైతాంగం అంతా ప్రభుత్వం ఇచ్చే సాయం గురించి ఎదురు చూస్తోందన్నారు. రైతులకు బోనస్ ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని ఎందుకు దాని గురించి మాట్లాడటం లేదంటూ ప్రశ్నించారు.
Harish Rao Comment about Rythu Bandhu
రైతులు పండించిన వరి ధాన్యానికి రూ. 500 బోనస్ ఎప్పుడు ఇస్తారంటూ ప్రశ్నించారు హరీశ్ రావు(Harish Rao). పండించిన వడ్లను ఎప్పుడు కొనుగోలు చేస్తారంటూ నిలదీశారు మాజీ మంత్రి. రైతు బంధు పెంచుతామని అన్నారని, పెంచిన రైతు బంధు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాల్సన అవసరం రాష్ట్ర సర్కార్ పై ఉందన్నారు.
ఇదిలా ఉండగా తాజాగా హరీశ్ రావు చేసిన కామెంట్స్ పై మంత్రులు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ఏర్పడి కనీసం మూడు రోజులు కూడా కాలేదన్నారు. అప్పుడే విమర్శలు ఎలా చేస్తారంటూ నిప్పులు చెరిగారు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు. తాము 10 ఏళ్ల కాలం పాలించారని అప్పుడు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read : CM Revanth Reddy : కేసీఆర్ ను పరామర్శించిన సీఎం