Vijayashanti : క‌ల్వ‌కుంట్ల కుటుంబం అవినీతికి అంద‌లం

కాంగ్రెస్ నాయ‌కురాలు విజ‌య‌శాంతి

Vijayashanti : హైద‌రాబాద్ – తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని గంప గుత్త‌గా ఖ‌జానా ఖాళీ చేశార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు విజ‌య‌శాంతి(Vijayashanti). అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డిన భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు.

Vijayashanti Serious Comments on KCR Family

గ‌త 10 ఏళ్లుగా తెలంగాణ‌ను నిట్ట నిలువునా మోసం చేశార‌ని ఆరోపించారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అంతులేని అవినీతికి తెర లేపార‌ని, ఏకంగా రూ. 5 ల‌క్ష‌ల కోట్లు దోచేశారంటూ , ఆ మొత్తం ఇప్పుడు ప్ర‌జ‌ల‌పై భారం ప‌డేలా చేసింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు విజ‌య శాంతి.

విచిత్రం ఏమిటంటే త‌మ హ‌యాంలోనే అవినీతికి పాల్ప‌డిన హ‌రీశ్ రావు తాజాగా కొలువుతీరిన ప్ర‌భుత్వం వారం రోజులు కాకుండానే రైతు బంధు ఎలా ఇస్తారంటూ ప్ర‌శ్నించ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు .

త‌మ ప్ర‌భుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌ను త‌ప్ప‌కుండా అమ‌లు చేసి తీరుతుంద‌న్నారు కాంగ్రెస్ నాయ‌కురాలు. ఇప్ప‌టికే 2 హామీల‌ను అమ‌లు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. మ‌హిళ‌ల‌కు ఉచితంగా బ‌స్సు ప్ర‌యాణంతో పాటు ఆరోగ్య శ్రీ కింద రూ. 10 ల‌క్ష‌ల సాయానికి శ్రీ‌కారం చుట్ట‌డం జ‌రిగింద‌ని స్ప‌ష్టం.

Also Read : CM Revanth Reddy Review : ఇక‌ ప్ర‌జావాణి రెండు రోజులు

Leave A Reply

Your Email Id will not be published!