Jevier Milie : అర్జెంటీనా చీఫ్ సంచలన నిర్ణయం
ఉచిత పథకాలు రద్దు చేస్తామని ప్రకటన
Jevier Milie : అర్జెంటీనా – ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తితో ఎదురు చూసిన అర్జెంటీనా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. ఊహించని రీతిలో ప్రజాకర్షకమైన నాయకుడిగా గుర్తింపు పొందిన జేవియర్ మిలి(Jevier Milie) అద్భుత విజయం సాధించారు. ప్రతిపక్ష నేతలకు చుక్కలు చూపించారు.
Jevier Milie Shocking Decision
అర్జెంటీనా ఎన్నికలు ఎవరు గెలుస్తారనే ఉత్కంఠకు తెర దించుతూ విజయ కేతనం ఎగుర వేశారు. ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదు కావడం విశేషం. మొత్తం 99.4 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. జేవియర్ మిలి 55.7 శాతం ఓట్లు సాధించి ఔరా అనిపించేలా చేశారు.
ఇదిలా ఉండగా 1983 సంవత్సరం తర్వాత ఇంత పెద్ద ఎత్తున మెజారిటీ రావడం ఇదే కావడం విశేషం. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. అర్జెంటీనా దేశంలో ఇప్పటి వరకు ఉచితంగా ప్రకటిస్తూ వచ్చిన పథకాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు జేవియర్ మిలి.
అర్జెంటీనా అధ్యక్షుడు తాజాగా చేసిన సంచలన ప్రకటన కలకలం రేపుతోంది. దేశ వ్యాప్తంగా ఉచితంగా పథకాలు అమలు చేయడం వల్ల దేశ ఖజానాకు భారీ ఎత్తున గండి పడిందని ఈ సందర్భంగా జేవియర్ మిలి పేర్కొన్నారు.
Also Read : Vijayashanti : కల్వకుంట్ల కుటుంబం అవినీతికి అందలం