CM Revanth Reddy : డ్రగ్స్ పై సీఎం ఉక్కుపాదం
ఆ పేరు ఎత్తితే భయపడాలి
CM Revanth Reddy : హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. పాలనా పరంగా పరుగులు పెట్టిస్తున్నారు. తనదైన శైలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున మద్యం ఏరులై పారుతోంది. ఇదే సమయంలో డ్రగ్స్ కు అడ్డు అదుపు లేకుండా పోయింది. దీనిపై సమీక్ష చేపట్టారు రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). సీఎస్ శాంతి కుమారితో పాటు రాష్ట్ర డీజీపీ రవి గుప్తా హాజరయ్యారు. ఎక్కడా కనిపించేందుకు వీలు లేదని స్పష్టం చేశారు.
CM Revanth Reddy Shocking Comments
మత్తు పదార్థాల పేరు ఎత్తేందుకు ప్రతి ఒక్కరు భయపడాలని ఆ స్థాయిలో చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ఎవరైనా ఎక్కడ ఉన్నా సరే దాడులు చేయాలని, ఎవరినీ ఉపేక్షించాల్సిన అవసరం లేదన్నారు రేవంత్ రెడ్డి.
ఏ పార్టీ అని చూడవద్దని, ఒకవేళ తమ పార్టీకి చెందిన వారు ఉన్నా సరే తాను పట్టించుకోనని కుండ బద్దలు కొట్టారు. డ్రగ్స్ , గంజాయి ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రత్యేకించి అదనపు టీమ్ లను రంగంలోకి దించాలని ఆదేశించారు సీఎం.
నార్కోట్రిక్స్ అధికారులు ఏం చేస్తున్నారంటూ సీరియస్ అయ్యారు. ఇప్పటి వరకు ఎందుకు దాడులు చేయలేదని ప్రశ్నించారు.
Also Read : Jevier Milie : అర్జెంటీనా చీఫ్ సంచలన నిర్ణయం