YS Sharmila : ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల..?
జగన్ కు చెక్ పెట్టే యోచనలో కాంగ్రెస్
YS Sharmila : అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ మరింత జోష్ పెంచింది. దక్షిణాదిన పాగా వేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందుకు సంబంధించి ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు అప్పగించింది.
YS Sharmila Viral in AP
ఇదే సమయంలో తాజాగా దేశంలోని 5 రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో మిజోరంలో ప్రతిపక్ష పార్టీ పవర్ లోకి వస్తే కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లను పోగొట్టుకుంది. ఇదే సమయంలో గత 10 ఏళ్లుగా తెలంగాణలో కొలువు తీరిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెక్ పెట్టింది. 119 సీట్లకు గాను 64 సీట్లను కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ.
తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల(YS Sharmila) అనూహ్యంగా తాజాగా జరిగిన శాసన సభ ఎన్నికల నుంచి పోటీ చేయకుండా తప్పుకుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు ఇచ్చింది.
అన్నకు పోటీగా వైఎస్ షర్మిలను ఏపీ కాంగ్రెస్ లోకి తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో కర్ణాటక నుంచి ఆమెకు రాజ్యసభ సభ్యురాలిగా అవకాశం ఇవ్వాలని కూడా నిర్ణయించినట్టు తెలిసింది. మొత్తంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు గనుక అప్పగిస్తే సీన్ ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : Telangana Ministers : మాజీ సీఎంకు పరామర్శల వెల్లువ