Telangana Speaker : రేపే తెలంగాణ స్పీకర్ ఎన్నిక
నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్
Telangana Speaker : హైదరాబాద్ – నూతనగా తెలంగాణలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇందులో భాగంగా ప్రస్తుతానికి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ని ప్రొటెం స్పీకర్ ను నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఎన్నికైన 119 మంది అభ్యర్థులతో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయించారు అక్బరుద్దీన్ ఓవైసీ.
Telangana Speaker Elections Update
ఇదిలా ఉండగా ఓవైసీని ఎంపిక చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కాంగ్రెస్(Congress) సర్కార్ కావాలని ఎంఐఎంకు ఛాన్స్ ఇచ్చిందని ఆరోపించారు.
కొత్తగా స్పీకర్ ఎన్నిక అయ్యేంత దాకా తమ పార్టీకి చెందిన అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయబోరంటూ స్పష్టం చేశారు పార్టీ చీఫ్. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు రాగా బీఆర్ఎస్ కు 39, బీజేపీకి 8 , ఎంఐఎంకు 7 సీట్లు వచ్చాయి. ఇక ఒకే ఒక్క సీటును సీపీఐ చేజిక్కించుకుంది.
ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా స్పీకర్ గా వికారాబాద్ నియోజకవర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ ను ఎన్నుకున్నారు. ఈ మేరకు ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో ఈనెల 14న గురువారం సభాపతిగా కొలువు తీరుతారని రాష్ట్ర సర్కార్ వెల్లడించింది.
Also Read : Diya Kumari DY CM : డిప్యూటీ సీఎంగా రాజకుమారి