CM Revanth Reddy : హైదరాబాద్ అభివృద్దిపై సీఎం ఫోకస్
మెట్రో రైలు ప్రాజెక్టు, విస్తరణ ప్రణాళిక
CM Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పరిపాలనా పరంగా ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ప్రత్యేకించి హైదరాబాద్ అభివృద్దిపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. మెట్రో రైలు ప్రాజెక్టు, దాని విస్తరణ ప్రణాళికలు, ఎయిర్ పోర్టు మెట్రో ప్రాజెక్టుపై సమీక్షించారు.
CM Revanth Reddy Focus on Hyderabad
నగర జనాభాలో ఎక్కువ భాగం మధ్య, తూర్పు ప్రాంతాలు పాతబస్తీలో ఉన్నాయని పేర్కొన్నారు. ఎంజిబీఎస్- ఫలక్‌నుమా నుండి ఓల్డ్ సిటీ మీదుగా ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని సిఎం స్పష్టం చేశారు.
ఎయిర్పోర్ట్ మెట్రో ప్లాన్, టెండర్‌ను తాత్కాలికంగా నిలిపి వేయాలని రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. ఫార్మా సిటీ స్థానంలో టౌన్షిప్ నిర్మించేలా చూడాలన్నారు. ఎంజీబీఎస్, ఫలక్ నుమా, ఎల్బీ నగర్ , చాంద్రాయణగుట్ట మీదుగా ప్రత్యామ్నాయ అలైన్మెంట్ లను త్వరగా సిద్దం చేయాలని ఆదేశించారు సీఎం.
ఇదిలా ఉండగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి దాకా ప్రభుత్వ పరంగా అన్ని శాఖలను సమీక్షిస్తూ వస్తున్నారు. ప్రతి శాఖను జల్లెడ పడుతున్నారు. అంతే కాదు పక్కదారి పట్టిన పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేయడం ప్రారంభించారు. నీతి, నిజాయతీ, సమర్థత కలిగిన ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించారు రేవంత్ రెడ్డి.
Also Read : MLC Kavitha : కోమటిరెడ్డి ఆరోగ్యంపై కవిత ఆరా