Bandi Sanjay : కరీంనగర్ – తాజాగా శాసన సభ ఎన్నికలు ముగిశాయి. తక్కువ ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , మాజీ బీజేపీ చీఫ్ , కరీనంగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పటేల్. ఈ నేపథ్యంలో బండి ఒంటెద్దు పోకడపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు. గురువారం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ మేరకు బండి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bandi Sanjay Viral with his Comments
సీనియర్ నాయకులు బండిని టార్గెట్ చేయడం విస్తు పోయేలా చేసింది. ఈసారి జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) కు బదులుగా పార్టీకి చెందిన సీనియర్ నేతలకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే తాము సపోర్ట్ చేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
బండి సంజయ్ తనకు ఎదురే లేదనే రీతిలో ప్రవర్తన ఉంటోందని ఆవేదన చెందారు. పార్టీ కోసం కష్ట పడుతున్న వారిని పట్టించు కోవడం లేదని వాపోయారు. బండి సంజయ్ అనుసరిస్తున్న తీరుపై బీజేపీ హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.
ఆయన ఒంటెద్దు పోకడ కారణంగా కరీంనగర్ జిల్లాలో బీజేపీ రాను రాను బలహీన పడుతోందని, ఇలాగైతే గెలవడం చాలా కష్టమని పేర్కొన్నారు. మొత్తంగా బండి తీరుపై పార్టీ శ్రేణులు బహిరంగంగా విమర్శించడం విస్తు పోయేలా చేసింది.
Also Read : Smriti Irani : రుతుస్రావం సహజం – స్మృతీ