Chandra Babu Naidu : ప్రభుత్వ వైఫల్యం బాధితులకు శాపం
నిప్పులు చెరిగిన నారా చంద్రబాబు నాయుడు
Chandra Babu Naidu : అమరావతి – టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మరోసారి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. తాను రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించానని అన్నారు. గురువారం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు.
Chandra Babu Naidu Comment AP Govt Ruling
రాష్ట్రంలో చోటు చేసుకున్న వర్షాల కారణంగా వేలాది ఎకరాలలో పంటలు కోల్పోయారని , బాధితులను ఆదుకోవడంలో సీఎం జగన్ వైఫల్యం చెందారని ఆరోపించారు. ఏరియల్ సర్వే చేస్తే రైతుల బాధలు తెలుస్తాయా అని ప్రశ్నించారు. మిచౌంగ్ తుపానుతో రాష్ట్రం తీవ్రంగా నష్ట పోయిందన్నారు.
దాదాపు 22 లక్షల ఎకరాలలో పంటలకు నష్టం వాటిల్లిందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu) ప్రశ్నించారు. దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది సీఎం జగన్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత బాధ్యతా రాహిత్యంతో ఎలా వ్యవహరిస్తారంటూ మండిపడ్డారు.
తుపాను వస్తుందని ముందస్తుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా ఎందుకు అలర్ట్ గా ఉండలేక పోయారంటూ నిలదీశారు. తెలిసిన వెంటనే చర్యలు తీసుకుని ఉండి వుంటే ఇంత పెద్ద ఎత్తున నష్టం వాటిల్లి ఉండేది కాదన్నారు నారా చంద్రబాబు నాయుడు.
Also Read : Bandi Sanjay : బండి తీరుపై గరం గరం