R Krishnaiah : కుల గణన అంటే భయం ఎందుకు
కేంద్ర సర్కార్ పై ఆర్. కృష్ణయ్య ఫైర్
R Krishnaiah : హైదరాబాద్ – బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన నేరుగా కేంద్రంలో కొలువు తీరిన మోదీ , బీజేపీ సంకీర్ణ సర్కార్ ను ఏకి పారేశారు. గురువారం ఆర్. కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు.
R Krishnaiah Comment
తాము గత కొన్నేళ్లుగా కుల గణన జరగాలని డిమాండ్ చేస్తూ వస్తున్నామని అన్నారు. కానీ గతంలో ఏలిన పాలకులు ప్రస్తుతం కొనసాగుతున్న పాలకులు దీని గురించి పట్టించు కోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా కోటా ఎంత ఉందనేది ముందుగా తేలాల్సిన అవసరం ఉందన్నారు. లేక పోతే బడ్జెట్ లో ఎవరికి ఎంత లభిస్తుందనేది తెలియడం లేదని వాపోయారు.
ఎస్సీ, ఎస్టీలకు మాదిరి గానే చట్ట సభలలో వెనుక బడిన తరగతులకు చెందిన వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆర్. కృష్ణయ్య(R Krishnaiah). కుల గణనతోప్రజల కంటే, కుల సంఘాల కంటే ప్రభుత్వానికే ఎక్కువగా అవసరం అవుతుందని అది తెలుసు కోక పోవడం దారుణమన్నారు .
చట్ట సభల్లో తాను పలుమార్లు ఇదే రిజర్వేషన్ల విషయానికి సంబంధించి ప్రస్తావించడం జరిగిందని తెలిపారు. కానీ పట్టించు కోలేదని దీనిని తాను పూర్తిగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు ఆర్. కృష్ణయ్య.
Also Read : Chandra Babu Naidu : ప్రభుత్వ వైఫల్యం బాధితులకు శాపం