KCR Discharge : రేపే మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్
యశోద ఆస్పత్రి నుంచి ఫామ్ హౌస్ కు
KCR : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఆరోగ్యం కుదుట పడింది. ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చాక పార్టీ ఘోరంగా దెబ్బ తినడం, ఆశించిన సీట్లు రాక పోవడంతో తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చిన వెంటనే చెప్పకుండానే తన ఫామ్ హౌస్ కు చెక్కేశారు.
KCR Discharge will be Tomorrow
ఆయన తన రాజీనామా పత్రాన్ని నేరుగా గవర్నర్ కు ఇవ్వకుండా తన వాహనంలో ఫామ్ హౌస్ కు వెళ్లి పోయారు. ఆనాటి నుంచి నేటి దాకా పవర్ ను ఎల్లకాలం తన వద్దనే ఉండాలని అనుకున్న కేసీఆర్(KCR) కు ఉన్నట్టుండి ఈ రిజల్ట్స్ కోలుకోలేని షాక్ ఇచ్చారు. దీంతో ఉన్నట్టుండి తాను ప్రత్యర్థిగా భావించిన రేవంత్ రెడ్డి సీఎం కావడం, దూకుడు పెంచడంతో తట్టుకోలేక పోయారు కేసీఆర్.
దీంతో బాత్రూంకు వెళ్లిన సమయంలో జారి పడ్డాడు. ఆయనకు తుంటి విరిగింది. హుటా హుటిన యశోద ఆస్పత్రికి తరలించారు. శస్త్ర చికిత్స చేయించిన అనంతరం కులాసాగా ఉన్నారు . ప్రస్తుతం ఆయనకు మరికొన్ని వారాల పాటు రెస్ట్ అవసరమని ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించింది. దీంతో డిసెంబర్ 15న కేసీఆర్ ను డిశ్చార్జ్ చేయనున్నట్లు ప్రకటించారు వైద్యులు. తనను చూసేందుకు ఎవరూ రావద్దంటూ కోరారు స్వయంగా మాజీ సీఎం.
Also Read : V Hanumantha Rao : బీసీలపై మోదీ కపట నాటకం