Priyanka Chaturvedi : భద్రతా లోపం ప్రియాంక ఆగ్రహం
హోం మంత్రి అమిత్ షా పై ఫైర్
Priyanka Chaturvedi : న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది పార్లమెంట్ ఘటన. లోక్ సభ జీరో అవర్ కొనసాగుతుండగా కొందరు ప్రవేశించి నానా హంగామా సృష్టించారు. ఇది పూర్తిగా భద్రతా వైఫల్యం వల్లనే జరిగిందని ఆరోపించారు. ఇందుకు సంబంధించి 9 మందిపై వేటు వేశారు. ఇదిలా ఉండగా ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించామని , త్వరలోనే నివేదిక వస్తుందని స్పష్టం చేశారు స్పీకర్ ఓం బిర్లా.
Priyanka Chaturvedi Slams Modi Govt
ఈ మొత్తం వ్యవహారంపై పలు అనుమానాలు ఉన్నాయని, ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించి ఎందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఒక్క మాట కూడా మాట్లాడ లేదని నిప్పులు చెరిగారు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది(Priyanka Chaturvedi).
దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎందుకు స్పందించ లేదన్నారు. కనీసం స్పందించాల్సిన , బాధ్యత కలిగిన వారు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని అన్నారు. భద్రత ఉల్లంఘనపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తే 15 మంది ఎంపీలను సస్పెండ్ చేశారని ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని నిలదీశారు ఎంపీ. ఇదే సమయంలో పాస్ లు తీసుకుని లోక్ సభ గ్యాలరీలోకి వచ్చిన వారి వివరాలు ఎందుకు బయట పెట్టడం లేదన్నారు ప్రియాంక చతుర్వేది.
ఇది పూర్తిగా బీజేపీ ఆడుతున్న నాటకంలో ఓ భాగమని ఆమె ఆరోపించారు. వెంటనే హోం, పీఎం కీలకమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
Also Read : MK Stalin : కేంద్ర సర్కార్ తీరుపై స్టాలిన్ ఫైర్