Smita Sabharwal : సచివాలయంలో స్మిత ప్రత్యక్షం
అంతా అవాక్కయిన వైనం
Smita Sabharwal : హైదరాబాద్ – సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఎట్టకేలకు ఉత్కంఠకు తెర దించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. గతంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ ను సాగనంపారు జనం. అయితే సీఎంవోలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న స్మితా సబర్వాల్ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నప్పటికీ ఇప్పటి వరకు రాలేదు. కనీసం మర్యాద పూర్వకంగా కలవలేదు. దీంతో స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులోకి వెళుతోందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
Smita Sabharwal Comment
చివరకు ఆమె సెక్రటేరియట్ కు రాకుండానే సోషల్ మీడియా మాధ్యమంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ కామెంట్స్ కలకలం రేపాయి. కేసీఆర్ హయాంలో ఒక వెలుగు వెలిగారు స్మితా సబర్వాల్(Smita Sabharwal). అంతే కాకుండా బీహార్ కు చెందిన ఐఏఎస్ లంతా ఒక ఆట ఆడుకున్నారు. కీలక శాఖలన్నీ వాళ్ల చేతుల్లో పెట్టుకుని కోట్లకు పడలెత్తారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇదే సమయంలో రూ. 1,20 ,000 కోట్ల ప్రజా ధనంతో కట్టిన కాళేశ్వరంతో పాటు మిషన్ భగీరథ ప్రాజెక్టులకు పూర్తి బాధ్యత వహించాల్సింది కూడా స్మితా సబర్వాలేనన్న ప్రచారం జోరందుకుంది. ఈ మొత్తం వ్యవహారంలో అంతులేని అవినీతి చోటు చేసుకుందని సీఎం సంచలన ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉండగా స్మితా సబర్వాల్ ఎట్టకేలకు అజ్ఞాతాన్ని వీడారు. ఇవాళ సచివాలయంలో మంత్రి సీతక్క బాధ్యతలు తీసుకుంటుండగా ఆమె తళుక్కున మెరిశారు.
Also Read : IAS Officers : ఐఏఎస్ లకు స్థాన చలనం