Revanth Reddy Convoy : రేవంత్ నిర్ణయం జనం హర్షం
కాన్వాయ్ క్లియరెన్స్ కు ఆదేశం
Revanth Reddy Convoy : హైదరాబాద్ – సీఎంగా కొలువు తీరిన ఎనుముల రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తనకు తిరుగే లేదని స్పష్టం చేశారు. పోలీస్ శాఖపై సీఎం సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy Convoy Decision Viral
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ డీఎస్పీ పోస్టుకు రాజీనామా చేసిన నళినికి ఖుష్ కబర్ చెప్పారు. ఆమెను ఎందుకు తిరిగి విధుల్లోకి తీసుకోకూడదో చెప్పాలంటూ ఆదేశించారు. ఖాళీగా ఉన్న పోలీస్ కానిస్టేబుల్ , హోం గార్డు పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
ఇదే సమయంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కాన్యాయ్ కి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కోసం ట్రాఫిక్ ను ఆపవద్దని సూచించారు. తన జర్నీ కారణంగా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోకూడదని పేర్కొన్నారు.
తన కోసం ట్రాఫిక్ ను ఆప వద్దంటూ పోలీస్ ఆఫీసర్లను సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆదేశించారు. ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా తన కాన్వాయ్ ను తీసుకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని, ఇది వెంటనే జరగాలని డీజీపీని ఆదేశించారు సీఎం. సాధారణ స్థాయిలోనే తన కాన్వాయ్ వెళ్లాలని స్పష్టం చేశారు. దీంతో రేవంత్ రెడ్డి తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రజలు.
Also Read : Revanth Reddy Review : సీఎం సమీక్ష ఆరోగ్య శాఖపై ఆరా