MD Shakeel : మాజీ ఎమ్మెల్యే షకీల్ కు ఝలక్
కుటుంబ సభ్యుల రైస్ మిల్లులో తనిఖీలు
MD Shakeel : నిజామాబాద్ జిల్లా – రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో గులాబీ నేతల అక్రమాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొన్న ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశెన్నగారి జీవన్ రెడ్డి ప్రభుత్వ సంస్థలు ఆర్టీసీ, విద్యుత్, ఆర్థిక సంస్థలకు చెల్లించిన డబ్బులను ఎగ్గొట్టేందుకు ప్లాన్ చేశారు . చివరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వీరి బండారం బయట పడుతోంది. మాజీ మంత్రి మల్లారెడ్డి దౌర్జన్యంగా భూములను రాయించు కోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
MD Shakeel Viral with Cases
తాజాగా మరో బాగోతం వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్(MD Shakeel) కుటుంబ సభ్యుల అడ్డగోలు దందా బయట పడింది. షకీల్ కుటుంబ సభ్యులకు చెందిన రైస్ మిల్లులో తెలంగాణ పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఏకంగా రూ. 70 కోట్ల విలువైన 3,33,28 టన్నుల కస్టమైజ్డ్ మిల్లింగ్ బియ్యాన్ని దారి మళ్లించారని గుర్తించారు. దీనికి సంబంధించి లెక్క లేకుండా పోయిందని తమ విచారణలో తేలిందని పేర్కొన్నారు. ఇవన్నీ దుర్వినియోగం అయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ గూండాల దౌర్జన్యాలు, దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడుతున్నారు.
Also Read : Rahul Gandhi : మోదీ నిర్వాకం దాడులకు కారణం