CM Revanth Reddy : కేసీఆర్ కు కాంగ్రెస్ రాజకీయ భిక్ష
షాకింగ్ కామెంట్స్ చేసిన రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. శనివారం అసెంబ్లీలో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు. ఈ సందర్బంగా కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిందే తమ కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. ఆనాడు ఎంపీటీసీగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఛాన్స్ ఇచ్చిన చరిత్ర మరిచి పోతే ఎలా అని ఎద్దేవా చేశారు.
CM Revanth Reddy Comments on KCR
పోతిరెడ్డిపాడు గురించి దివంగత మంత్రి పి. జనార్దన్ రెడ్డి ఒక్కడే పోరాటం చేశాడని , మిగతా వాళ్లు దాని పేరుతో మెప్పు పొందేందుకు ప్రయత్నం చేశారని ఎద్దేవా చేశారు. తాజాగా అసెంబ్లీలో మాట్లాడుతున్న వాళ్లు ఎవరూ అప్పుడు లేరన్నారు.
ఇంకా మాట్లాడేందుకు, నిలదీసేందుకు, ప్రశ్నించేందుకు 5 ఏళ్ల సమయం ఉందన్నారు రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). ఈ తొమ్మిదిన్నర ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏమేం జరిగిందో , ఎన్ని అక్రమాలు చోటు చేసుకున్నాయో కూలంకుశంగా పూర్తి వివరాలతో వెల్లడిస్తామని స్పష్టం చేశారు ఎనుముల రేవంత్ రెడ్డి.
కొందరు నాయకులకు ప్రజాస్వామ్యం అంటే ఏమిటో, దాని స్పూర్తి ఏమిటో తెలియదన్నారు. ఒకవేళ చెప్పేందుకు ప్రయత్నం చేసినా వాళ్లు వినిపించు కోరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 49 శాతంతో గెలుపొందిన వారికంటే కేవలం ఒక్క శాతం తేడాతో విజయం సాధించిన వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్న సోయి లేక పోతే ఎలా అని సెటైర్ వేశారు ఎనుముల రేవంత్ రెడ్డి.
Also Read : MD Shakeel : మాజీ ఎమ్మెల్యే షకీల్ కు ఝలక్