Nara Lokesh : జగన్ పాలనలో జనం ఆగమాగం
నిప్పులు చెరిన నారా లోకేష్
Nara Lokesh : అమరావతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అన్ని వర్గాల ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారని అయినా జగన్ పట్టించు కోవడం లేదని మండిపడ్డారు. యువ గళం పాదయాత్ర రెండో విడతలో భాగంగా నారా లోకేష్ యలమంచలి నియోజకవర్గంలో పర్యటించారు.
Nara Lokesh
ఈ సందర్బంగా మహిళలు, యువతులు, రైతులు, నిరుద్యోగులు, చిన్నారులు నారా లోకేష్(Nara Lokesh) ను కలుసుకున్నారు. వారితో ఆయన ముచ్చటించారు. త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయని, టీడీపీ, జనసేన సంయుక్త ఆధ్వర్యంలో అధికారంలోకి రానున్నామని స్పష్టం చేశారు.
అడ్డగోలు హామీలతో జనాన్ని బురిడీ కొట్టించిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు. అమరావతిని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడని, అందుకే మూడు రాజధానులను ప్రకటించాడని, రాజకీయంగా లబ్ది పొందేలా చేశాడని ఆరోపించారు నారా లోకేష్.
అందుకే వైకాపా అరాచక పాలనపై విసుగు చెందిన వైసీపీ నేతలు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు టీడీపీలో చేరుతున్నారని అన్నారు.
Also Read : Nalini EX DSP : సీఎం అభిమానం నళిని సంతోషం