Bhatti Vikramarka Dy CM : ప్రజా భవన్ లో భట్టి విందు
హాజరైన సీఎం ..జైరాం రమేష్
Bhatti Vikramarka : హైదరాబాద్ – తెలంగాణలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే బాధ్యతలు స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తమ తమ శాఖలపై సమీక్ష చేపట్టారు.
Bhatti Vikramarka Dy CM Arranged Feast in Praja Bhavan
త్వరలో క్రిస్మస్ ఫెస్టివల్ సందర్బంగా డిప్యూటీ సీఎం సమీక్ష చేపట్టారు. క్రిష్టియన్ సోదర సోదరీమణులకు గిఫ్టులు కూడా ఇవ్వాలని ఆదేశించారు. తాజాగా ప్రజా భవన్ లో భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) విందు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు జైరాం రమేష్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నత శాఖల అధికారులు హాజరయ్యారు. గతంలో కొలువు తీరిన కేసీఆర్ సర్కార్ ఇలాంటి సంప్రదాయాలను తుంగలో తొక్కింది.
శాసన సభలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం నడిచింది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ అధికారం పేరుతో చేసిన తప్పులను బయట పెడతానని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.
మరో వైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల కథేంటి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. తన్నీరు హరీశ్ రావు సైంత రేవంత్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
Also Read : Nara Lokesh : జగన్ పాలనలో జనం ఆగమాగం