Revanth Reddy CM : కేసీఆర్ నిర్వాకం రాష్ట్రం నాశనం
నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణ పేరుతో అందినంత మేరకు దోచుకున్న ఘనుడు మాజీ సీఎం కేసీఆర్ అంటూ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy). అసెంబ్లీ సాక్షిగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా గత తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో సాగించిన అరాచకాలను, అవినీతిని పూర్తి స్థాయిలో ఎండగట్టే ప్రయత్నం చేశారు. ఒక రకంగా ఏకి పారేశారు. గుక్క తిప్పుకోకుండా గులాబీ గూండాలు సాగించిన విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లు స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
Revanth Reddy Slams Former CM KCR
అధికారానికి దూరమైనా ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారని, ఇకనైనా మారాలని లేక పోతే ఉన్న సీట్లు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు సీఎం. ఇకనైనా పద్దతి మార్చు కోవాలని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, ఇష్టానుసారం అప్పులు చేసుకుంటూ పోయారని ఆరోపించారు. ఏ శాఖను తీసుకున్నా మోయలేని భారాన్ని నెత్తిన మోపారని, చివరకు ఖాళీ ఖజానాను తమకు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.
తాము మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని చేతికి అప్పగిస్తే కేసీఆర్ తన ఖాన్ దాన్ పెంచుకునేందుకు ప్రయత్నం చేశాడని ధ్వజమెత్తారు. త్వరలోనే లెక్కలు, అప్పులు, అవినీతి, అక్రమాలు బయటకు వస్తాయని అంత దాకా కాస్తా ఓపిక పట్టాలని సూచించారు.
Also Read : Rahul Gandhi : ఆధునిక టెక్నాలజీపై దృష్టి పెట్టాలి