MIM Congress : మారిన స్వరం హస్తంతో స్నేహం
గాలి పటం స్నేహ హస్తం
MIM Congress : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు శర వేగంగా మారుతున్నాయి. ఊహించని రీతిలో కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం కూలి పోయింది. ప్రజలు దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చారు. దీంతో నిన్నటి దాకా అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగించిన నిరంకుశ పాలనకు చరమ గీతం పాడారు. మొత్తం 119 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు రాగా బీఆర్ఎస్ 39 సీట్లకే పరిమితమైంది. ఇక ఊహించని రీతిలో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. ఏకంగా 8 సీట్లు సాధించింది. విస్తు పోయేలా చేసింది.
MIM Congress Comment
ఎన్నికల సమయంలో ఉప్పు నిప్పు లాగా ఉండేవి అసదుద్దీన్ ఓవైసీ సారథ్యంలోని ఎంఐఎం(MIM) , రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ. కానీ మెజారిటీ బొటా బొటిగా రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎంఐఎంతో దోస్తానా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ఇస్తామని ప్రకటించారు.
దీంతో నిన్నటి దాకా తీవ్ర విమర్శలు చేసుకున్న ఇరు పార్టీలు స్నేహ హస్తానికి తెర తీశాయి. ఇదే క్రమంలో అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ అభివృద్దిపై జరిగిన సమీక్షా సమావేశంలో తన పక్కనే కూర్చో బెట్టుకోవడం మరింత ఆసక్తిని రేపింది. ఇరు పార్టీలు ముందుకు సాగేందుకు నిర్ణయించడం విశేషం.
Also Read : Raghuram Rajan : ఆర్థిక వ్యవస్థకు రాజన్ చికిత్స