Nagendra Babu : పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలి
నాగేంద్ర బాబు కీలక వ్యాఖ్యలు
Nagendra Babu : మంగళగిరి – జనసేన పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు నటుడు , పార్టీ కీలక నేత నాగేంద్ర బాబు. గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం ముఖ్య నేతలతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా కీలక అంశాలపై చర్చించారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ రాష్ట్రంలో అధికార పక్షానికి ప్రత్యామ్నాయ స్థాయికి ఎదగాలని అన్నారు.
Nagendra Babu Comment
నెల్లూరు సిటీ, కోవూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల నేతలతో సమావేశం అయ్యారు నాగ బాబు(Nagendra Babu). సీనియర్ నాయకులు అజయ్ కుమార్ , మన క్రాంత్ రెడ్డిలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ముందస్తుగానే రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయని అన్నారు నాగేంద్ర బాబు.
మొత్తం 175 స్థానాలలో అత్యధిక స్థానాలలో విజయం సాధించేందుకు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. గతంలో కంటే ఈసారి తెలుగుదేశం, జనసేన పార్టీలు సంయుక్తంగా కలిసి ముందుకు సాగుతాయని, ప్రజా సమస్యలను ఏకరువు పెడుతూ ముందుకు వెళతాయని స్పష్టం చేశారు నాగ బాబు.
విస్తృతంగా కార్యాచరణను రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్రంలో కొలువు తీరిన వైసీపీ జగన్ పాలన అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. ఈసారి పవర్ లోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు.
Also Read : MIM Congress : మారిన స్వరం హస్తంతో స్నేహం