Sridhar Babu : కక్ష సాధింపు చర్యలు ఉండవు
స్పష్టం చేసిన శ్రీధర్ బాబు
Sridhar Babu : హైదరాబాద్ – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు ప్రజలు ఎప్పుడెప్పుడా అని కేసీఆర్ ను , ఆయన కుటుంబీకులను అరెస్ట్ చేస్తారని ఎదురు చూస్తున్నారు. కానీ వారందరికీ కోలుకోలేని షాక్ ఇస్తూ మంత్రి ఎలాంటి చర్యలు ఉండవంటూ చావు కబురు చల్లగా చెప్పారు. ఇప్పటికే తెలంగాణ పేరుతో తొమ్మిదన్నర ఏళ్లుగా అరాచక, అవినీతి పాలన సాగించారు. అందుకే బీఆర్ఎస్ ను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు.
Sridhar Babu Comment about Congress Ruling
ఓ వైపు పవర్ లోకి వచ్చిన వెంటనే విచారణకు ఆదేశిస్తామని, ఎంతటి వారైనా సరే అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలిస్తామని గొప్పగా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ సీన్ పూర్తిగా మారి పోయింది. అక్రమార్కులుగా పేరు పొందిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని జోరుగా ప్రచారం జరుగతోంది.
ఇక బాధ్యత కలిగిన మంత్రిగా ఉన్న దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Sridhar Babu) బీఆర్ఎస్ కు ఊపిరి పీల్చుకునేలా కీలక ప్రకటన చేశారు. అదేమిటంటే గత ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలు ఉండవని స్పష్టం చేశారు. ఒకవేళ గతంలో సర్కార్ తీసుకున్న పాలసీలు బాగుంటే వాటిని ముందుకు తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తారని చెప్పారు. తెలంగాణను అన్ని రంగాలలో ముందంజలో ఉండేందుకు ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.
Also Read : Nadendla Manohar : రంగులు తప్ప అభివృద్ది ఎక్కడ