Konda Surekha : బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా
సంతకం చేసిన మంత్రి కొండా సురేఖ
Konda Surekha : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరిన కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు ఉమ్మడి ఓరుగల్లు జిల్లాకు చెందిన కొండా సురేఖ. ఆదివారం ఆమె మంత్రిగా సచివాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా పలు దేవాలయాలకు చెందిన పండితులు ఆమెను ఆశీర్వదించారు. సీఎం రేవంత్ రెడ్డి కొండా సురేఖకు(Konda Surekha) పర్యావరణం, అటవీ, దేవాదాయ శాఖలను అప్పగించారు.
Konda Surekha Promise
ఈ సందర్బంగా బాధ్యతలు స్వీకరించారు కొండా సురేఖ. తొలి సంతకం బాధిత కుటుంబాలకు మేలు చేకూర్చేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జంతువుల బారిన పడిన కుటుంబాలను ఆదుకునేందుకు గాను తమ ప్రభుత్వం భరోసా ఇస్తుందని స్పష్టం చేశారు కొండా సురేఖ.
బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయంగా రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు పెంచడం కోసం తొలి ఫైల్ పై సంతకం చేశారు మంత్రి. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
మెల మెల్లగా అన్ని సమస్యలను పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తానని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు కొండా సురేఖ.
Also Read : CM Revanth Reddy : ఎల్లుండి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి