PM Modi : పార్ల‌మెంట్ ఘ‌ట‌న బాధాక‌రం

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ మోదీ

PM Modi : న్యూఢిల్లీ – పార్ల‌మెంట్ లోని లోక్ స‌భ‌లో దాడి జ‌రిగిన కొన్ని రోజుల త‌ర్వాత తీరిక‌గా స్పందించారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ఆదివారం మోదీ మాట్లాడారు. ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం దుర‌దృష్ఖ‌ర‌మ‌ని పేర్కొన్నారు. దీనిని ఏ మాత్రం త‌క్కువ‌గా అంచ‌నా వేసేందుకు వీలు లేద‌న్నారు .

PM Modi Comment about Parliament Attack

అయితే దీనిని అడ్డం పెట్టుకుని ప్ర‌తిప‌క్షాలు అన‌వ‌స‌రంగా రాద్దాంతం చేస్తున్నాయంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు న‌రేంద్ర మోదీ(PM Modi). లోక్ స‌భ‌లో బీజేపీ ఎంపీ వెంట కొంద‌రు ఎంట‌ర్ అయ్యారు. పొగ విడిచారు. చివ‌ర‌కు వారిని ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించారు. కేసు న‌మోదు చేశారు.

ఇదిలా ఉండ‌గా ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్ చేశారు. భ‌ద్ర‌తా వైఫ‌ల్యానికి ప్రధాన కార‌ణం పేరుకు పోయిన నిరుద్యోగమేన‌ని అన్నారు. దీని వ‌ల్ల‌నే యువ‌తీ యువ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నార‌ని తెలిపారు.

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌తి ఏటా 2 కోట్ల మందికి జాబ్స్ ఇస్తాన‌ని మాట ఇచ్చార‌ని, కానీ దానిని ఆయ‌న అమ‌లు చేయ‌డంలో విఫ‌లం అయ్యార‌ని ఆరోపించారు. ఇక‌నైనా బీజేపీ స‌ర్కార్ మేలుకోక పోతే జ‌నం రాళ్లు వేసే స్థాయికి వ‌స్తార‌ని హెచ్చరించారు రాహుల్ గాంధీ.

Also Read : Harish Rao : రేవంత్ సీఎంన‌ని మ‌రిచి పోయారు

Leave A Reply

Your Email Id will not be published!