Nagendra Babu : అమరావతి – ప్రముఖ నటుడు, జనసేన పార్టీ కీలక నేత నాగేంద్ర బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు తెలంగాణలో ఓటు హక్కు ఉన్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు. అయితే తాను తాజాగా రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో జరిగిన పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించు కోలేదని స్పష్టం చేశారు. సోమవారం నాగేంద్ర బాబు మీడియాతో మాట్లాడారు.
Nagendra Babu Comment about Vote
పదే పదే తాను ఓటు వేయలేదని తెలుసుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. వాస్తవాలు తెలుసు కోకుండా తనపై అనవసరంగా బురద చల్లడం మాను కోవాలని పేర్కొన్నారు నాగేంద్ర బాబు(Nagendra Babu). రూల్ ప్రకారమే తాను ఓటు రద్దు చేసుకున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరగబోయే శాసన సభ ఎన్నికల్లో జనసేన పార్టీ పరంగా కీలకమైన పాత్ర పోషించడం జరుగుతోందన్నారు నాగేంద్ర బాబు. పార్టీ కోసం మద్దతుగా ఏపీలో తనకు ఓటు హక్కు కలిగి ఉండేందుకు ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు స్పష్టం చేశారు .
ఇదిలా ఉండగా నాగేంద్ర బాబు చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఇకనైనా రాసే ముందు ఆలోచించి, ఆధారాలు లేకుండా ప్రచురించ వద్దని, ప్రచారం చేయొద్దని స్పష్టం చేశారు నటుడు నాగేంద్ర బాబు.
Also Read : Uttam Kumar Reddy : ప్రాజెక్టుల వివరాలు ఇవ్వండి
.