TPCC PAC Meeting : పట్టం కట్టిన ప్రజలకు థ్యాంక్స్
టీపీసీసీ పీఏసీ సమావేశం తీర్మానం
TPCC PAC Meeting : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చేలా చేసినందుకు నాలుగున్నర కోట్ల ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాజకీయ వ్యవహారాల కమిటీ . సోమవారం గాంధీ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, పీసీసీ కార్యవర్గం పాల్గొంది.
TPCC PAC Meeting Updates
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేలా చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశ పెట్టారు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ . దీనికి టీపీసీసీ పీఏసీ మద్దతు తెలిపింది. పార్టీకి చెందిన అగ్ర నేతలు పాల్గొన్నారు.
గౌడ్ తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం విశేషం. ఈ సమావేశంలో ఆరు గ్యారెంటీలపై ప్రధానంగా చర్చకు వచ్చింది. ఆరు నూరైనా సరే అమలు చేసి తీరాలని, ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఈ సందర్బంగా టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ఎమ్మెల్సీలుగా ఎవరికి ఛాన్స్ ఇవ్వాలనే దానిపై తర్జన భర్జనలు కూడా జరిగినట్లు టాక్. తెలంగాణ జన సమితి పార్టీ చీఫ్ కోదండరాం కు లేదా సీనియర్ నాయకుడు అద్దంకి దయాకర్ కు ఇద్దరిలో ఎవరికో ఒకరికి కట్ట బెట్టాలని నిర్ణయం తీసుకోవాల్సిందిగా సీఎం రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఠాక్రేకు సూచించినట్లు సమాచారం.
Also Read : Ponguleti Srinivas Reddy : ఆరు గ్యారెంటీల అమలు పక్కా